1934 మే 31న కృ ష్ణాజిల్లా వానపాముల గ్రామం లో ఓ భక్తి తాత్పరత గల హైందవ కుటుంబంలో జన్మించారు. శ్రీరామదాసు
అను పేరు కలిగి బాల్యం నుండి భక్తి భావములు కలిగియున్నను యవనములో చెడు సహవాసములతో తన ఇష్టము వచ్చినట్లు
జీవించారు. అట్టి విచ్చలవిడి జీవితం, శారీరక అస్వస్థత ఆయనలో అధిక మరణభయం కలుగుచేయగా చనిపోయిన పిదప
మోక్షమా? నరకమా? అన్న ప్రశ్నలు ఆయనను వేధించ సాగాయి. క్రైస్తవం అంటే ఏమాత్రం పరిచయం లేని ఆయనకు ఎవరో
బైబిల్ ఇవ్వ గా అది చదవనారం భించిన ఆయనకు మత్తయి ఐదు ఎనిమిదిలోని హృదయ శుద్ధిగలవారు ధన్యులు వారు దేవుని
చూచెదరు అని యేసు చెప్పిన మాటలు ఆసక్తిని రేకెత్తించాయి.
దేవుని కనుగొనకపోతే చనిపోదామనే ఉద్దేశంతో ఓంటరిగా కొండపల్లి ఖిల్లాకు వెళ్లి ఆ రాత్రంతా హైందవ తీరులో తపోనిష్టలో
ఉండిపోయారు. అది నిశీధి రాత్రి, పైన మబ్బులు, సన్నగా వర్షం, చలి భయానక వాతావరణంలో వారి చుట్టూ గొప్ప వెలుగు
ప్రకాశించెను. ఓ దివ్య పురుషుడు ధవళ వస్త్రధారణతో ప్రత్యక్షమై నీవు శరీర సంబంధివి కాక ఆత్మ సంబంధివిగా జీవిం చు,
శరీర సంబంధులు దేవునికి దూరస్తులు ఆత్మ సంబంధులు దేవునికి సమీపస్తులు గలతీ పత్రిక చదువు అని చెప్పి
అదృశ్య మాయెను 1953 అక్టోబర్ 27న కలిగిన దర్శనంతో పాటు బాల్యం నుండి పీడించుచు ఎన్నో మందులు వాడినా
నివారణ కాని ఉబ్బసం వ్యాధిని ప్రభువు ముట్టి స్వస్థపరిచారు. అది ఆయన జీవితం లో ఓ గొప్ప మలుపు.
ఆ తదుపరి సమస్తాన్ని విడిచి దేవుని సేవ పిలుపు పొంది అపోస్తలుడు పి.ఎం .సామ్యూ ల్ గారి సహచర్యములో నీటి బాప్తిస్మము
పొంది సీయోను బైబిల్ కళాశాలలో వేద విద్య నభ్యసిం చి, పరిశుద్ధాత్మ తో నింపబడి, హస్త నిక్షేపణం పొంది, ఆత్మల రక్షణ పట్ల
భారం, పట్టుదల మరియు కన్నీటి ప్రార్థనతో 1954 వ సంవత్సరంలో విజయవాడలోని బాడవ పేటలో సేవ ఆరంభించారు.
అప్పుడే క్రొత్తగా ప్రభువు నెరిగిన దేవినేని పద్మతో 1955 మే 26న వివాహం జరిగెను.
దైవ చిత్తానుసారముగా 1960 మధ్యలో మంగళగిరిలో నేల అద్దెకు తీసుకుని ఆరాధనలు జరిగించుతున్న తరుణంలో
1961లో దైవజనురాలు హైనీ అమ్మ గారితో పరిచయం ఏర్పడడం మందిరం స్థలంకొనడం , ఆ తదుపరి 1964-65
సంవత్స రంలో పెద్ద ఆలయం నిర్మించడం జరిగింది. విజయవాడ కంకిపాడు, మంగళగిరి, అమరావతి, నవులూరు, ఎర్రబాలెం
కంతేరు, నంబూరు, మందడం , నవ్వులూరు, తాడేపల్లి, చిన్నకాకాని, ఆత్మకూరు పరిసర ప్రాం తాలలో మరియు కృ ష్ణా
జిల్లాలోని అనేక గ్రామాలలో విరివిగా సువార్త బీజములు వెదజల్లి అనేకులు క్రీస్తు జీవం పొందుటకు కారకులయ్యారు.
యవనప్రాయం లో మంగళగిరి వెళ్లిన తొలి దినాల్లోనే గొప్పబహిరంగ సభలు ఏర్పాటు చేయుట ద్వారా ఎన్నో ఆత్మల రక్షణ
గొప్ప ఉద్యమం నేర్చుటకు కారణమైంది. వారి పరిచర్యలో అనేకులు స్వస్థత నొందుట, దురాత్మలచే పీడింపబడుచున్నవారు విడుదలనుందుట తరచుగా జరిగేవి.
ఫుల్ గాస్పల్ చర్చస్ ఆఫ్ ఇండియాలో హైని అమ్మ గారికి చేదోడు వాదోడుగా ఉండి సంఘముల స్థాపన యొక్క ప్రారంభ
దశలో సహదాసులైన వై.టి స్వామిదాసు గారు దైవ కృ పావరం గారు, నతానియేలు మున్నగువారితో కలిసి పనిచేసిరి. హైనీ
చిల్డ్రన్స్ హోమ్ నిర్మాణపు పనులలోను పరిచర్యలలోనూ విరివిగా పాల్గొని ఈ సంస్థల శ్రేయస్సు మరియు అభివృద్ధికి
హితోదికముగా కృషిచేసిరి. ఫుల్ గాస్పల్ చర్చస్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులుగా అనేక సం ఘముల స్థాపన కొరకు సంఘ
కాపరులను విశ్వాసులను ప్రభువులో బలపరిచి ఆదర్శ ప్రాయులుగా నిలిచిరి. 1973 సంవత్సరంలో మంగళగిరిలో హైనీ
అమ్మగారు అనాధ ఆశ్రమమును నెలకొల్పగా పిల్లలను పర్యవేక్షిస్తూ నీతిలోనూ, భక్తిలోను సుబుద్ధిలోనూ ఎదుగుటకు కృషిచేసిరి
1977లో సంభవించిన భయంకర పెను తుఫాను బాధిత ప్రాంతములలో సంఘ పరిచర్యలు మందిర నిర్మాణం పునరావాస
కార్య క్రమాల్లో దాదాపు పది సంవత్సరాల పాటు అవిరళ కృషి సల్పిరి. అమ్మగారు అప్పగించిన పనిని తన సొంత పనిగా
భావించి వారములు, నెలలు ఇంటికి దూరంగా ఉంటూ నమ్మకమైన దాసునిగా పనిచేసిరి. 1987, 90 లలో సంఘాలలో
శిష్యత్వ పరిచర్య చేపట్టి అనేకమంది యవ్వనస్తులకు వాక్యతర్ఫీదు ఇచ్చుటలో ఘనముగా వాడబడిరి. 1994లో గుంటూరు
జిల్లా రంగానగర్ లోను విజయవాడ కృష్ణలం కలోను ఫుల్ గాస్ప ల్ సంఘములను స్థాపించి కాపరిగా పనిచేసిరి. ఆఖరి ఘడియ
వరకు నూతనముగా అనేక మందిని క్రీస్తు వద్దకు నడిపించవలెనన్న తపన ఆయనలో స్పష్టంగా కనిపించేది..
దైవజనులు యోబుగారిలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రవర్తనలో ఇతరులకు మాదిరిగా ఉంటూ చెడును నిర్ద్వంద్వంగా
ఖండిస్తూ మంచి ఉపదేశమును ఇతరులకు ప్రకటించేవారు. సం ఘములను దర్శించు సమయములో ఖాళీగా సమయమును
వ్యర్థముగా గడపక వాక్యపఠనములోనూ ప్రార్థనలోనూ ఇతరుల సమస్యలకు పరిష్కారములు తెలుపుటలోను గడిపేవారు.
తాను మోకరిం చి ప్రార్థన చేస్తూ ఇతరులను ప్రార్థింపచేసేవారు. ఆ దైవజనుని క్షేమకరమైన సలహాలను పాటించి అనేకమంది
తమ జీవితంలో సహనం సంతోషము పొందిరి. విడిపోయిన కుటుంబాలను అనైక్య తతో ఉన్న సంఘాలను మరల
ఐక్య పరచుటకు దైవదాసులు చేసిన పరిచర్య ఎంతో ఘననీయం . మూర్ఖముగా వ్య వహరించిన అనేక మందిలో ఆయన
మృ దుభాషిత సంభాషణలు గొప్ప మార్పును తెచ్చాయి.
అలనాడు అపోస్తులులు వాక్యము ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రజలు హృదయములలో నొచ్చుకొని పశ్చాత్తాప్తులై తమ జీవితములలో
మార్పు చెందినట్లుగా జోబుగారు వాక్యము ప్రకటించుచున్నప్పుడు హృదయములను నచ్చుకొని తప్పిదము విషయమై
పశ్చాత్తాపపడి అనేకమంది కన్నీరు కార్చి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుతో సమాధానపడేవారు. ఏ కార్యక్రమమైనను
మీటింగులైనను పిలవబడినప్పుడు సకాలములో విచ్చేసి సగౌరవం పొందేవారు స్వార్ధరహిత ఆలోచనలతో మారుమూల ప్రాంత
విశ్వాసులను బలపరుచుటకు ఎంతటి ప్రయాసకైనా ఓర్చికాలినడక, కాలవలు దాటుటవంటి కష్టతరమైన ప్రయాణములను
తరచుగా చేస్తుండేవారు పరిచర్య కృ ష్ణ గుంటూరు జిల్లాలలో మాత్రమే గాక భారతదేశమంతటా విస్తరించాలని ఆ దైవజనుని
చిరకాలవాంఛ. అది తమ జీవిత కాలం లోనే చూడాలని ఎం తో తపన చెం దేవారు ఉన్నత విద్య చదవనప్పటికీ ఉన్నతమైన
ఆత్మీయ ఆశయములు కలిగి ఉం డేవారు.
చెక్కు చెదరని చిరునవ్వు హుందాతనం సడలని గంభీరథ ఎట్టి పరిస్థితిలోనైనా నిబ్బరము ఆ దైవజనుని ప్రత్యే కతలు.
ఆదర్శ వంతమైన నిందారహితమైన ఆ దైవజనుని జీవితము అందరికీ మాదిరి కరమైనది. ప్రభువు నామ మహిమార్థము
జోబుగారు చేసిన కృషి ప్రతి ఒక్క రికి స్ఫూర్తినిచ్చినది.
విశ్వాస యోధునిగా ప్రార్థన పరునిగా అనేక కీలకమైన సమస్యల నడుమ చావైనా బతుకైనా దేవుని కోసమే తనదంత అర్పించి
ఉన్నత అభిషేకము కలిగి, తాను పొందిన పెంతెకోస్తు సత్యాన్ని ఆయా ప్రాంతాలకు మోసుకు వెళ్ళుటకై, చల్లారిన ప్రజలను
తిరిగి వెలిగించుటకు ఘనమైన పనిగావించిరి. వైరి అయిన అపవాది వారి విశ్వా సమును సన్నగిల చేసి పరిచర్యకు దూరం
చేయాలని అనేకమార్లు ప్రయత్నించెను. పరిస్థితుల ప్రభావానికి బానిస కాక అనేక అనారోగ్య సమయాల్లో సైతం దేవునియందలి
నిరీక్షణ వీడక పట్టుదలతో సేవలో ముందుకు సాగారు. ఓమారు పరిచర్య కు వెళ్లి బస్సు దిగుతూ ఉన్న సమయాన్ని కాలు
విరిగిపోవడం తో పది నెలలకు పైగా మంచం పై ఉన్నను, మరల 1980వ సంవత్సరంలో భయంకరమైన ఊపిరితిత్తుల వ్యాధితో
గుంటూరు వైద్య శాలలో దాదాపు మరణశయ్య పై పడియున్నను తన విశ్వా సాన్ని వీడలేదు. దానిని ఘనపరిచిన ప్రభువు మరి 17
సం వత్స రాలు ఆయుష్షును పొడిగించి బహుగా సేవలో వాడబడుటకు కృపనిచ్చారు. 98వ సం వత్స రములో గుండెపోటుతో
మద్రాసులో ఆసుపత్రిలో బహుబాధలో ఉన్నప్పు డు ఆయనను సందర్శించిన ఒక సేవకునితో ఇది నా జీవితములో ఏడవ పరీక్ష
ఇందును అంతం వరకు దేవుని కొరకు నమ్మకముగా ఉండునని పలికిన మాటలు ఆ సేవకునికి బైబిల్ నందలి యోబును
గుర్తుచేసెను.
దేవుడు వారికనుగ్రహించిన ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు వారి కుటుంబములతో సహా దేవుని సేవలో ఉండుటకు
మంచి మాదిరి చూపించిరి. క్లిష్ట పరిస్థితుల్లో సహా పిలిచిన ప్రభువు పట్ల సడలని విశ్వా సంతో జీవించి తనకు అప్పగించిన పనిని
ఎంతో నమ్మ కముగా నిర్వర్తించి తన పరుగును ముగించి బహుమానమునకై 1998 సెప్టెంబరు 24న ప్రభు సన్నిధికి చేరారు.